Suryapet | తండ్రి దేశం కోసం… కూతురు సమాజం కోసం

Suryapet | తండ్రి దేశం కోసం… కూతురు సమాజం కోసం

సూర్యాపేట, ఆంధ్ర‌ప్ర‌భ : దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన తండ్రి ఆశయాలను సమాజ సేవ ద్వారా కొనసాగించాలనే సంకల్పంతో కూతురు ముందుకు వచ్చిన హృదయస్పర్శి సంఘటన సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 46వ వార్డులో చోటుచేసుకుంది. కార్గిల్ యుద్ధంలో శత్రు తుపాకీ గుండుకు బలై దేశానికి అమరుడైన వీరసైనికుడు పోలోజు గోపయ్య చారి త్యాగం నేటికీ ప్రజలకు ప్రేరణగా నిలుస్తోంది.

ఆ అమరవీరుని ఏకైక కూతురు పోలోజు మౌనిక, తండ్రి చూపిన సేవా మార్గాన్నే ఎంచుకొని సమాజ అభివృద్ధి కోసం రాజకీయ రంగంలో అడుగుపెట్టింది. 46వ వార్డు అభివృద్ధే లక్ష్యంగా బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మౌనిక, ప్రజల సమస్యల పరిష్కారం, మౌలిక వసతుల అభివృద్ధి, పారిశుధ్యం, యువత–మహిళల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇస్తోంది. దేశం కోసం తండ్రి చేసిన త్యాగాన్ని గుర్తుచేసుకుంటూ, సమాజ సేవకు తనను ఆశీర్వదించాలని కోరుతూ కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను విజ్ఞప్తి చేస్తుంది.

Leave a Reply