అభివృద్ధి చేసిన పార్టీకి ఓటు వేయండి

వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ : 32 వ వార్డు అభివృద్ధికి బిఆర్ఎస్ పార్టీకే సాధ్యం ఆదరించండి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని టిఆర్ఎస్ అభ్యర్థి భాగ్యరేఖ నాగన్న యాదవ్ కోరారు. వనపర్తి మున్సిపల్ 32 వార్డులో ఎన్నికల ప్రచారంలో కార్ జోరుగా దూసుకుపోతుంది. వార్డులో నీ ప్రజలందరికీ రోజు మంచినీళ్లు వచ్చే సమయము వాట్సప్ గ్రూపుల ద్వారా చేరే విధంగా ప్రతిరోజు తెలియజేస్తున్నానన్నారు. ఏనుగుల బొంద పార్కు, 14వ ఫైనాన్స్ నిధుల నుండి 18 లక్షలు రూపాయలతో మొక్కలు,కాంపౌండ్ వాల్, గ్రిల్స్ ఏర్పాటు చేయడం జరిగింది అని తెలిపారు. 15వ ఫైనాన్స్ల నుండి నిధులు తేవడం జరిగింది.

డ్రైనేజీ వర్కులు, కమిటీ హాల్స్, జిమ్ము పార్క్ కంపౌండ్ వాల్, గ్రిల్స్, జిమ్ము పార్కు వాకింగ్ ట్రాక్, హనుమాన్ టెంపుల్ క్రీడా ప్రాంగణం, మిషన్ భగీరథ, సిసి రోడ్స్, మెయిన్ డ్రైనేజీ పూడికతీత, కెసిఆర్ ప్రభుత్వంలో 68 మందికి పింఛన్లు ఇప్పియడం జరిగింది. డబల్ బెడ్ రూమ్ ఇండ్లు 24 మందికి అదేవిధంగా బీసీ బందు ఐదు మందికి కళ్యాణ లక్ష్మి, సీఎం రిలీఫ్ ఫండ్, మైనార్టీలకు కుట్టు మిషన్స్, మహిళా డిగ్రీ కాలేజ్ దగ్గర ట్రాన్స్ఫార్మర్లు, మెయిన్ ఏరియాలో డబల్ స్ట్రీట్ లైట్స్, కరోనా టైంలో స్పెషల్ కోర్ స్ప్రే, దోమల నివారణకు చర్యలు తీసుకోవడం జరిగింది అన్నారు.

తదితర పనులు చేస్తూనే ఉన్నాను అదేవిధంగా ఇంకా ఏమైనా ఉన్నా గుర్తించి మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సహకారంతో అన్ని పనులు కూడా పూర్తి చేస్తాను. మీ అందరికీ అందుబాటులో ఉండి ఎవరికి ఏ ఆపద వచ్చినా నేను కాపాడుకుంటాను అన్నారు. టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి భాగ్యరేఖ నాగన్న యాదవ్ గెలుపు ఖాయం అని ఓటర్లు అంటున్నారు. మా కాలనీలో అభివృద్ధి చూసి ఓటు వేస్తున్నాం అంటున్నారు గతంలో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి సహకారంతోనే కాలనీ అభివృద్ధి చెందిందని 32 వ వార్డు టిఆర్ఎస్ అభ్యర్థి భాగ్య రేఖ నాగన్న యాదవ్ అన్నారు. మద్యానికి డబ్బులకు అమ్ముడు పోవద్దని అభివృద్ధినీ చూసి పని చేసే వారికే ఓటు వేయాలని ఇతర నాయకుల మాటలు నమ్మి మోసపోవద్దు అన్నారు. ఆదరిస్తే అభివృద్ధి చేసి చూపిస్తా కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.

Leave a Reply