అవకాశం ఇవ్వండి..అభివృద్ధి చేస్తా..

20వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థి మంజుల

కల్వకుర్తి: ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ): మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను ఓటర్లు ఆశీర్వదించి గెలిపిస్తే వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని 20వ వార్డు బి ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి ఎడ్మ మంజుల బోజిరెడ్డి పేర్కొన్నారు. ఎన్నికల్లో భాగంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి ప్రతిరోజు వార్డులో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని చెబుతూ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలే తమ గెలుపుకు దోహదపడతాయని ఎడ్మ మంజుల బోజిరెడ్డి చెబుతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందంటూ ప్రచారంలో వాటిని ఆస్త్రాలుగా మలుచుకుంటూ ప్రజలకు వివరిస్తూ తమదైన శైలిలో ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కెసిఆర్ పాలనలోనే అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరిగిందని పేర్కొంటున్నారు. వార్డు ప్రజలు ఆలోచించి ఈనెల 11న జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఎడ్మ మంజుల బోజిరెడ్డి ఓటర్లను కోరారు.