ఆశీర్వదించండి.. అభివృద్ధి చేస్తా..
2వ వార్డు అభ్యర్థి.సెండే గణేష్
ఆసిఫాబాద్.ఫిబ్రవరి 5 (ఆంధ్రప్రభ): మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను ఓటర్లు ఆశీర్వదించి గెలిపిస్తే 2 వవార్డును అన్ని రంగాలలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని 2వ వార్డు బి ఆర్ ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి సండే గణేష్ అన్నారు. ఎన్నికల్లో భాగంగా ఈరోజు2 వ వార్డులో . ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ మీ అమూల్యమైన ఓటు కారుగుర్తుపై ఓటువేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. కౌన్సిలర్ గా గెలిపిస్తే వార్డు అభివృద్ధి కోసం డ్రైనేజీ విద్యుత్ మంచినీటి సిసి రోడ్లు తో పాటు వార్డ్ లో ఉన్న మౌలిక వస్తువులు కల్పిస్తానన్నారు. ఎమ్మెల్యే సహకారంతో అధిక నిధులు తీసుకువచ్చి మరింత అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు.
