వార్డు లో సమస్యలు లేకుండా చేస్తాను

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెల రాజశ్రీ, లక్ష్మణ్

భీమ్‌గల్‌ టౌన్, ఫిబ్రవరి 3 ( ఆంధ్రప్రభ ) వార్డు ను తనకున్న రాజకీయ అనుభవం, పలుకుబడి తో ఆదర్శంగా చేస్తానని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మల్లెల రాజశ్రీ, లక్ష్మణ్ అన్నారు. బుధవారం తొమ్మిదో వార్డు లో వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా ఇంటింటికి తిరుగుతూ ఓటు వేయాలని కోరారు. వార్డు లో నెలకొన్న సమస్యలు బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ముత్యాల సునిల్ కుమార్, పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్, రాష్ట్ర సహకార సంఘాల చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, మినరల్ డెవోలోప్ మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఈరవత్రి అనిల్ సహకారం తో పరిష్కారం చేస్తానని పేర్కొన్నారు. స్థానికుడిగా, ప్రజా సమస్యలు పరిష్కరించే నాయకుడిగా తనకు అవకాశం ఇవ్వాలని, చేతి గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

Leave a Reply