Water problem | అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు….

Water problem | అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు….

  • 10వ వార్డులో మంత్రి సహకారంతో ఇంటి స్థలాలు
  • వార్డు అభివృద్ధికి పట్టం కట్టండి
  • 10వ వార్డు కాంగ్రెస్ కౌన్సిలర్ అభ్యర్థి రేఖ ప్రవీణ్

Water problem | జోగిపేట, ఆంధ్రప్రభ : జోగిపేట మున్సిపల్ పట్టణంలోని 10వ వార్డులో ఉన్న ప్రతి నిరుపేద కుటుంబానికి తాను అండగా ఉంటానని, అర్హులందరికీ ప్రభుత్వం తరఫున ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి పట్లోళ్ల రేఖ ప్రవీణ్ అన్నారు. ఇప్పటికే వార్డులో 35 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయించానని, అర్హులైన వారికి ఇంటి స్థలాలు కూడా ఇప్పిస్తానని ఆమె తెలిపారు.

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ రోజు వార్డులో ఇంటింటికి ముమ్మరంగా ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ అభ్యర్థి రేఖ ప్రవీణ్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా కౌన్సిలర్ గా ఉండి వార్డు అభివృద్ధికి కృషి చేశానని, అండర్ డ్రైనేజ్, సీసీ రోడ్లు, శాశ్వత నీటి సమస్య పరిష్కరించామన్నారు. చెప్పటాల్సిన మిగిలిన పనులను పూర్తి చేస్తానన్నారు.

వార్డు ప్రజలు ప్రజా ప్రభుత్వానికే పట్టం కట్టాలన్నారు. 10వ వార్డు అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. మీ అమూల్యమైన ఓటు హస్తం గుర్తుకు వేసి ఇంటి ఆడబిడ్డగా ఆదరించి భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply