మరోసారి అవకాశం ఇవ్వండి-ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతాం

ఎన్నికల ప్రచారంలో బిజెపి రాష్ట్ర నాయకులు కొండయ్య
మక్తల్ , ఫిబ్రవరి 4 (ఆంధ్రప్రభ) మున్సిపల్ ఎన్నికల్లో మరోసారి బిజెపికి అవకాశం ఇవ్వండి మక్తల్ మున్సిపాలిటీని ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామని మాజీ ఎంపీపీ బీజేపీ రాష్ట్ర నాయకులు కొండయ్య అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 4వ వార్డులో బిజెపి అభ్యర్థి పికె.నర్సింహా కు మద్దతుగా జోరుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు.
ఈ సందర్భంగా కొండయ్య ఓటర్లను కలిసి, తమ అమూల్యమైన ఓటును కమలం గుర్తుకు వేసి పీ.కే. నరసింహను వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం నిధులతోనే మునిసిపాలిటీల అభివృద్ధి సాధ్యమని అన్నారు. కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థానికంగా ఎంపీ డీకే. అరుణమ్మ సహకారంతో మక్తల్ మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో నడిపిస్తామని అన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కేవలం బిజెపితోనే సాధ్యమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు నిధులు ఇవ్వదని అన్నారు. రెండేళ్లకు పైగా మక్తల్ మున్సిపాలిటీలో జరిగిన అభివృద్ధి శూన్యమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా వినియోగించలేదని అన్నారు. అందుకే మక్తల్ అభివృద్ధి చెందాలంటే బిజెపి అభ్యర్థులను గెలిపించి మరోసారి మున్సిపాలిటీని బిజెపి పరం చేయాలని కొండయ్య ఓటర్లకు విన్నవించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, కాలనీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
