BJP | శాంతిరెడ్డి ప్రచారం..

BJP | శాంతిరెడ్డి ప్రచారం..

BJP, ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని 3వ వార్డులో బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి చిలుగురి శాంతిరెడ్డి బుధవారం ముమ్మరంగా ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. సుభాష్ నగర్ ఆదర్శ్ నగర్, మెయిన్ రోడ్లలో ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుసుకొని తనను ఆశీర్వదించి భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు అయిలి సందీప్ గౌడ్, చిలుగురి నర్సిరెడ్డి, కళ్లెం రాజు గౌడ్, బైరి మహేందర్ గౌడ్, కటకం వెంకటేష్, సురేష్, లింగం, వికాస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply