kalki2 | ఇంట్రెస్టింగ్.. కమల్ స్క్రీన్ టైమ్ షాక్ ..?

Kalki2 | కమల్ హాసన్ పాత్ర ఎంత కీలకమో తెలుసా?
kalki2 | భారీ అంచనాలు
సుప్రీం యాస్కిన్ పాత్రలో కమల్ హాసన్
kalki2 | లో కమల్ స్క్రీన్ టైమ్ లీక్
కొత్త గెటప్స్ తో కమల్ సర్‌ప్రైజ్
ప్రభాస్ క్యారెక్టర్‌లో కీలక మార్పులు
సాయి పల్లవి ఎంట్రీతో పెరిగిన క్రేజ్
kalki2 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, యూనివర్శిల్ హీరో కమల్ హాసన్.. ఈ క్రేజీ కాంబోలో రూపొందిన భారీ చిత్రం కల్కి. ఈ సినిమా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో కల్కి సీక్వెల్ కల్కి 2 పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఈపాటికే కల్కి 2 సెట్స్ పైకి రావాలి కానీ.. ప్రభాస్ వేరే ప్రాజెక్టుల్లో బిజీగా ఉండడం వలన రాలేదు. ఇప్పుడు కల్కి 2 పట్టాలెక్కడానికి రెడీ అవుతోంది. అయితే.. ఇందులో కమల్ క్యారెక్టర్ ఎంత సేపు కనిపిస్తుందో.. ఎలా ఉంటుందో ఇంట్రెస్టింగ్ న్యూస్ లీకైంది. ఇంతకీ.. లీకైన న్యూస్ ఏంటి..?
కల్కి మూవీలో కమల్ హాసన్ సుప్రీమ్ యాస్కిన్ క్యారెక్టర్ లో కనిపించి షాక్ ఇచ్చారు. ఆయన ఊహించని గెటప్ లో కనిపించేసరికి ఆడియన్స్ సర్ ఫ్రైజ్ అండ్ షాక్ అయ్యారని చెప్పచ్చు. అయితే.. కల్కిలో కమల్ కనిపించింది చాలా అంటే చాలా తక్కువ సేపే. ఆయన పాత్ర నిడివి తక్కువుగా ఉందనే చర్చ వచ్చినప్పుడు.. కల్కి 2లో మాత్రం కమల్ ఎక్కువ సేపు కనిపిస్తారని టాక్ వినిపించింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ కూడా కమల్ క్యారెక్టర్ కల్కి 2 లో ఎక్కువు సేపు ఉంటుందని.. ఆడియన్స్ థ్రిల్ ఫీలయ్యేలా ఉంటుందని చెప్పారు.

లీకైన న్యూస్ ఏంటంటే.. కల్కి 2 లో కమల్ పాత్ర కీలకంగా ఉంటుందట. ఆయన పాత్ర చుట్టూనే కథ అంతా తిరుగుతుందని.. వార్తలు వస్తున్నాయి. ఆయన పాత్ర నిడివి 90 నిమిషాలు ఉంటుందని.. కల్కి పార్ట్ 1 లో కనిపించిన గెటప్ మాత్రమే కాకుండా.. మరో డిఫరెంట్ గెటప్ లో కూడా కనిపిస్తారని ప్రచారం జరుగుతుంది. ఇంతకీ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కానుందంటే.. ఫిబ్రవరి నెలాఖరున స్టార్ట్ చేస్తారని.. ఈ షెడ్యూల్ లో కమల్ పాల్గొంటారని.. నెల రోజుల పాటు కమల్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం.
మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే.. ఇందులో దీపికా ప్లేస్ లో ఫిదా బ్యూటీ సాయిపల్లవి నటిస్తుందట. ఆమె పాత్ర చాలా స్ట్రాంగ్ గా.. చాలా ఎమోషనల్ గా సాగేలా ఉంటుందట. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్యారెక్టర్ పై పార్ట్ 1 లో విమర్శలు వచ్చాయి. కమెడియన్ లా ఉందని.. ఆయన పాత్రలో సీరియస్ గా లేదని కామెంట్లు వినిపించాయి. దీని పై సీరియస్ గా దృష్టి పెట్టిన నాగ్ అశ్విన్ చాలా మార్పులు చేర్పులు చేశాడట. ప్రభాస్ పవర్ ఫుల్ స్క్రీన్ ప్రెజెన్స్, కమల్ ఇంటెన్స్ పర్ ఫార్మెన్స్, అమితాబ్ యాక్షన్, సాయిపల్లవి యాక్టింగ్.. ఇక కల్కి 2 ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కల్కి 2 తో నాగ్ అశ్విన్ ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తాడని టాక్ వినిపిస్తోంది. మరి.. ఏం జరగనుందో చూడాలి.
