suspend | మోదీ ట్రంప్ కు ఎందుకు భయపడుతున్నారు?

suspend | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ ; ఎనిమిది మంది కాంగ్రెస్ ఎంపీలను లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా సస్పెండ్ చేశారు. స్పీకర్ ఓం బిర్లాపై పేపర్లు విసిరినందుకు వారిపై సస్పెన్షన్ వేటు పడింది. 8 మంది ఎంపీలను సస్పెండ్ చెయ్యాలని కేంద్రమంత్రి కిరణ్ రిజిజు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సభ ఆమోదించింది. తమిళనాడుకు చెందిన కాంగ్రెస్‌ ఎంపీలు ఎస్.వెంకటేశన్‌, మాణిక్కం ఠాగూర్, పంజాబ్ చెందిన ఎపీలు గుర్జీత్ సింగ్ ఔజ్లా, అమరీందర్ సింగ్ రాజా, కిరణ్ కుమార్ రెడ్డి (తెలంగాణ), కేరళకు చెందిన హిబీ ఈడెన్, డీన్ కురియకోస్ , మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ పడోలేను మిగిలిన బడ్జెట్ సమావేశాలకు హాజరు కాకూడదంటూ స్పీకర్ సస్పెండ్ చేశారు. భారత్‌-చైనా ఉద్రిక్తతలకు సంబంధించి ఆర్మీ మాజీ చీఫ్ నరవణె అముద్రిత పుస్తకంలోని అంశాలపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చర్చ జరపాలని డిమాండ్ చేశారు. దీంతో ఎంపీలు నిరసనలకు దిగి సస్పెన్షన్‌కు గురయ్యారు.

suspend

ప్రధాని మోడీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కి బయపడి దేశాన్ని అమ్మేశారని విపక్ష నేత కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు. అదానీపై అమెరికాలో కేసు ఉంది. నిజానికి ఇది మోదీపై కేసుగా పరిగణించాలని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో చాలా విషయాలున్నాయి. దానికి సంబంధించిన వివరాలను అమెరికా ఇప్పటికీ విడుదల చేయలేదు కాబట్టి, ప్రధాని మోదీ ట్రేడ్ డీల్ పై సంతకం చేశారని విమర్శించారు. ఇప్పటికైనా దేశ ప్రజలు నిజాలు తెలుసుకోవాలన్నారు. నాలుగు నెలలుగా నిలిచిపోయిన భారత్-అమెరికా ట్రేడ్ డీల్‌‌పై ఇంత అకస్మాత్తుగా సంతకాలు జరగడంపై దేశాన్నికి ఎంత లాభం వచ్చింది, ఆ వివరాలు కేంద్రం వెల్లడించాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.