that is megastar | అమృతం హర్షవర్ధన్ చెప్పిన ఆసక్తికర విషయాలివే..!

that is megastar | అమృతం హర్షవర్ధన్ చెప్పిన ఆసక్తికర విషయాలివే..!

that is megastar | అమృతం హర్షవర్ధన్‌గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటుడు
నటుడిగా, రచయితగా హర్షవర్ధన్ ప్రయాణం
‘మనం’ సినిమాతో రచయితగా ప్రత్యేక గుర్తింపు
దర్శకుడిగా మామ మశ్చేంద్ర, గుగ్లీ సినిమాలు
మెగాస్టార్ సినిమా విజయంతో పెరిగిన క్రేజ్
ఆంధ్రప్రభ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు

that is megastar | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : హర్షవర్ధన్ అనగానే.. ఏ హర్షవర్ధన్ అనే డౌట్ రావచ్చు. అదే.. అమృతం హర్షవర్ధన్ అనగానే ఠక్కున గుర్తొస్తారు. అమృతం సీరియల్ లో ఆయన నటించిన పాత్ర అంతలా గుర్తింపు తీసుకువచ్చింది. ఆతర్వాత నటుడుగా, రచయితగా, దర్శకుడుగా.. ఇలా తను ప్రవేశించిన ప్రతి శాఖలో.. తనదైన మార్క్ చూపించారు. రీసెంట్ గా మన శంకర్ వర ప్రసాద్ గారు మూవీలో మెగాస్టార్ పక్కన ఉండే తన టీమ్ మెంబర్ గా కీలక పాత్ర పోషించారు. తనదైన స్టైల్ లో ఎంటర్ టైన్ చేశారు హర్షవర్ధన్. నటుడుగా తెలుగు, తమిళ్, హిందీ చిత్రాల్లో నటించిన హర్షవర్ధన్ రచయిత మారి డైలాగ్స్ రాశారు.

that is megastar
that is megastar

ఏ ఏ సినిమాలు రాసారంటారా.. విశాఖ ఎక్స్ ప్రెస్, 3, ద్రోణ, గుండెజారీ గల్లతయ్యిందే, మనం, చిన్నదాన నీకోసం, గరు చిత్రాలకు డైలాగ్స్ రాసారు. వీటిలో అక్కినేని ఫ్యామిలీకే కాదు.. తెలుగు సినిమా ఇండస్ట్రీకే మరిచిపోలేని అద్భుత చిత్రం మనం సినిమాకి డైలాగ్స్ హర్షవర్ధన్ రాయడం విశేషం.

అక్కినేని ఫ్యామిలీ హీరోలు అక్కినేని, నాగార్జున, నాగచైతన్య.. ఇలా మూడు తరాల హీరోలు కలిసి నటించిన మనం సినిమాకి రాసిన డైలాగ్స్ హర్షవర్ధన్ కు మంచి పేరు తీసుకువచ్చాయి. ఆతర్వాత హర్షవర్ధన్ దర్శకుడుగా మారి మామ మశ్చేంద్ర, గుగ్లీ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇప్పుడు మన శంకర్ వరప్రసాద్ గారు మూవీలో నటించడంతో హర్షవర్ధన్ కు మరింత పేరు వచ్చింది.

ఈ సినిమా నేటికీ రికార్డు కలెక్షన్స్ తో దూసుకెళుతుండడం విశేషం. ఈ సందర్భంగా హర్షవర్ధన్ తో ఆంధ్రప్రభ చేసిన ప్రత్యేక ఇంటర్ వ్యూలో.. పలు ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. మరి.. హర్షవర్ధన్ ఏం చెప్పారు..? ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటపెట్టారో తెలుసుకోవాలి అనుకుంటున్నారా.. అయితే.. ఈ ఇంటర్ వ్యూలో చూడాల్సిందే.. మరి ఇంకెందుకు ఆలస్యం క్రింద ఉన్న లింక్ క్లిక్ చేయండి..

click here for more

click here to read

Leave a Reply