Doctors | ఇది వాజేడు వైద్యశాల పరిస్థితి..

Doctors | ఇది వాజేడు వైద్యశాల పరిస్థితి..

  • ఏజెన్సీలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం
  • ప్రజల చెంతకు చేరని ప్రభుత్వ వైద్యం
  • పేరుకే ఇద్దరు డాక్టర్లు విధుల్లో ఒక్కరు ఉండరు

Doctors | వాజేడు, ఆంధ్రప్రభ : ఏజెన్సీలో ప్రభుత్వ వైద్యుల నిర్లక్ష్యం రోజురోజుకు మితిమీరుతుంది దీనితో ప్రభుత్వ వైద్యం ప్రజల చెంతకు చేరడం లేదు ప్రభుత్వ వైద్యంపై ఆధారపడిన నిరుపేద కుటుంబాలకు వైద్యుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ వైద్యం అందని ద్రాక్షలా మారింది. రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన వైద్యులు విధులకు డుమ్మా కొట్టడంతో వైద్యం అందించే నాథుడు కరువయ్యాడు. మారుమూల ఏజెన్సీ ప్రాంతమైన ములుగు జిల్లా వాజేడు మండల కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో పేరుకే ఇద్దరు డాక్టర్లు ఒక్కరు కూడా విధుల్లో ఉండరు వైద్యం అందించరు. దీనితో ప్రభుత్వ వైద్యం ప్రజలకు అందని ద్రాక్షలా మారింది. ప్రభుత్వ వైద్యంపై ఆధారపడిన నిరుపేద కుటుంబాలు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చి గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది డాక్టర్లు వస్తారు వైద్య పరీక్షలు చేస్తారని ఎంతసేపు వేచి చూసిన రాకపోవడంతో అక్కడి స్టాఫ్ నర్స్ తో వైద్య పరీక్షలు చేయించుకొని నిరాశతో వెనుతిరుగుతున్నారు.

Doctors

లక్షల్లో జీతాలు తీసుకుంటూ విధుల పట్ల ఇంత నిర్లక్ష్యం చేయడం ఏమిటని మండల ప్రజానీకం మండిపడుతున్నారు. బుధవారం ఆశా డే అయినప్పటికీ సమయం 12 అయిన ఒక్క వైద్య అధికారి కూడా విధులకు హాజరు కాకపోవడం గమనర్హం ఆశ డే లో ఆశా వర్కర్లకు తగు సూచనలు సలహాలు అందించడానికి వైద్య అధికారులు హాజరు కాకపోవడం వారి నిర్లక్ష్యానికి అర్థం పడుతుంది. ఇక్కడి వైద్యుల నిర్లక్ష్యంపై పై అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయిందని మండల ప్రజానీకం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి బుధవారం గర్భిణీ స్త్రీలకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించాల్సిన వైద్య అధికారులు అందుబాటులో లేకపోవడంతో గర్భిణీ స్త్రీలు నిరాశకు లోనై ఇంటిదారి పడుతున్నారు.

Doctors

డాక్టర్ల నిర్లక్ష్యం వలన ప్రభుత్వం వైద్యం ప్రజల చెంతకు చేరడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలకు వస్తే వైద్యులు లేకపోవడంతో వైద్యం అందక ప్రైవేట్ ఆర్ఎంపి లను ఆశ్రయించి ఆర్థికంగా నష్టపోతున్నామని నిరుపేద కుటుంబాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యులు ప్రతిరోజు అందుబాటులో ఉండి ప్రజలకు వైద్య సేవలు అందించాల్సి ఉండగా విధులకు డుమ్మా కొడుతూ నిర్లక్ష్యం చేస్తున్న వైద్యులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ఈ ప్రాంత వాసులు ముక్తకంఠంతో కోరుతున్నారు

Doctors

Leave a Reply