NTR | లైనప్ మార్చడానికి కారణం…?

NTR | లైనప్ మార్చడానికి కారణం…?
- కొరటాల శివ ప్రీ ప్రొడక్షన్ లో బిజీ
- దేవర 2 లో జాన్వీ కపూర్ పాత్రకు ప్రాధాన్యత
- ఎన్టీఆర్ లైనప్ మారడానికి కారణం ఏంటి?
- త్రివిక్రమ్ మూవీ ఎందుకు ఆలస్యం అవుతోంది?
NTR | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ.. ఈ ఇద్దరి కాంబోలో రూపొందిన భారీ చిత్రం దేవర. జనతా గ్యారేజ్ తర్వాత ఎన్టీఆర్, కొరటాల శివ.. (Koratala Siva) కాంబోలో మూవీ అనగానే అటు అభిమానుల్లోనూ, ఇటు ఇండస్ట్రీలోనూ అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. అయితే… ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చినా.. ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర రికార్డు కలెక్షన్స్ రాబట్టడం.. 500 కోట్లకు పైగా కలెక్ట్ చేయడం విశేషం. దీంతో దేవర 2 పై మరింత క్రేజ్ ఏర్పడింది. ఇంతకీ.. దేవర 2 సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..? ఎన్టీఆర్ లైనప్ మారడానికి కారణం ఏంటి..?

NTR | దేవర 2 ఉంటుందా..? ఉండదా..?
అనేది ఇన్ని రోజులు సమాధానం లేని ప్రశ్నలా ఉండేది. ఇప్పుడు సమాధానం దొరికేసింది.. మే నెల నుంచి దేవర 2 సెట్స్ పైకి రానుందని నిర్మాత ఇటీవల తెలియచేశారు. ప్రస్తుతం కొరటాల శివ.. దేవర 2 ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నారు. దేవర సినిమాలో జరిగిన మిస్టేక్స్ దేవర 2 (Devara 2) లో జరగకుండా ఉండేలా కథ పై చాన్నాళ్లు నుంచి కొరటాల కసరత్తు చేస్తున్నారని తెలిసింది. దేవర పార్ట్ 1 లో కథానాయిక జాన్వీ కపూర్ పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదు. ఇప్పుడు దేవర 2 లో జాన్వీ పాత్రకు ప్రాముఖ్యత ఎక్కువ ఉంటుందని టాక్ వినిపిస్తోంది.

NTR | మే నుంచి దేవర 2 అనగానే..
మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో సినిమా ఏమైంది అనేది ఆసక్తిగా మారింది. ప్రస్తుతం ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ సినిమా (Movie) కంప్లీట్ చేసిన తర్వాత ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం.. త్రివిక్రమ్ తో మైథలాజికల్ మూవీ చేయాలి. కానీ.. ప్లాన్ మార్చి దేవర 2 ని పట్టాలెక్కించాలి అనుకుంటున్నారు. కారణం ఏంటంటే.. త్రివిక్రమ్ మూవీ క్యాన్సిల్ కాలేదట. ఉందట.. కాకపోతే ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేయడానికే ఒక సంవత్సరం టైమ్ పడుతుందట. అందువలనే ఈ గ్యాప్ లో దేవర 2 కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయ్యారట యంగ్ టైగర్. త్వరలోనే దేవర 2 గురించి అఫిషియల్ గా అనౌన్స్ చేస్తారని సమాచారం. అదీ.. అసలు సంగతి.

