Health | పిహెచ్ సీని తనిఖీ చేసిన డిఎం అండ్ హెచ్ వో…

Health | పిహెచ్ సీని తనిఖీ చేసిన డిఎం అండ్ హెచ్ వో…

Health | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండలం చౌటుపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిని డాక్టర్ రాజశ్రీ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.పి హెచ్ సి లో ఒపి సేవలు, ఇతర జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను సమీక్షించారు.

సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. గర్భిణీ స్త్రీలకు అందుతున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రతి గర్భిణీ స్త్రీకి ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పులు జరిగేలా చర్యలు తీసుకోవాలని వైద్యాధికారిని డాక్టర్ స్పందనను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పిహెచ్ సి వైద్యాధికారిణి డాక్టర్ స్పందన, ఆరోగ్య పర్యవేక్షకులు స్వరూప, పద్మ, ఎల్ టి పవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply