Attack | 15మంది మృతి, పలువురికి గాయాలు

Attack | 15మంది మృతి, పలువురికి గాయాలు
Attack | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : రష్యా- ఉక్రెయిన్ మధ్య చర్చలు జరగనున్న నేపథ్యంలో రష్యా మరోసారి ఉక్రెయిన్ పై దాడి చేసింది. ఆ దేశంలోని వివిధ ప్రాంతాలపై డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ దాడుల్లో 15 మంది మరణించగా, అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఉక్రెయిన్‌లోని ఆగ్నేయ డ్నిప్రోపెట్రోవ్స్క్ (Southeastern Dnipropetrovsk) ప్రాంతంలో గని కార్మికులను తీసుకెళ్తున్న బస్సుపై రష్యా డ్రోన్ దాడి చేసిందని ఆ దేశ ఇంధన మంత్రి తెలిపారు. ఈ ఘటనలో 12 మంది మరణించారని చెప్పారు. అంతకుముందు రాత్రిపూట, ఆదివారం జరిగిన వేర్వేరు రష్యన్ దాడుల్లో ఇద్దరు మరణించగా, తొమ్మిది మంది గాయపడ్డారని తెలిపారు. టెర్నివ్కా నగరం (Ternivka City)లో ఈ దాడి జరిగిందని పోలీసులు తెలిపారు. రాష్ట్ర అత్యవసర సేవ పోస్ట్ చేసిన ఫుటేజ్‌లో కాలిపోయిన బస్సు కిటికీలు రోడ్డు పక్కన పగిలిపోయాయి.
అయితే ఈ దాడులను రష్యా ఇంకా అధికారికంగా ధృవీకరించలేదు. అయతే రష్యా, ఉక్రెయిన్ మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయని జెలెన్ స్కీ ఇటీవలే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే ఈ దాడులు జరగడం గమనార్హం.
