Parakala | 15వ వార్డులో అభ్యర్థి విస్తృత ప్రచారం…

Parakala | 15వ వార్డులో అభ్యర్థి విస్తృత ప్రచారం…
Parakala | పరకాల, ఆంధ్రప్రభ : పరకాల పురపాలక సంఘం 15వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కందుకూరి వేణుగోపాల మూర్తి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ రోజు పరకాల పురపాలక సంఘం 15వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కందుకూరి వేణుగోపాల మూర్తి ఇంటింటి ప్రచారం విస్తృతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అభ్యర్థి వేణుగోపాల మూర్తి మాట్లాడుతూ… వార్డులోని ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతుందని, వార్డును అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీతోనే పరకాల అభివృద్ధి సాధ్యమని అన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని కోరారు. అభ్యర్థి కందుకూరి వేణుగోపాల మూర్తి వెంట గుగ్గిళ్ళ రాజు, ప్రసాద్, రాజు తదితరులు ఉన్నారు.
