died | బ్రిడ్జి పై నుంచి వాగులో పడి…

died | బ్రిడ్జి పై నుంచి వాగులో పడి…

  • యువకుడు మృతి

died | ధారూర్, ఆంధ్రప్రభ : వికారాబాద్ జిల్లా ధారూర్ మండల పరిధిలోని ధారూర్ స్టేషన్ గ్రామంలోని ధోర్నాల్ స్టేషన్ – ధారూర్ గ్రామాల మధ్య‌ ఉన్న మేథడిస్ట్ చర్చి సమీపంలోని బ్రిడ్జిపై నుంచి వాగులో పడి యువ‌కుడు మృతిచెందారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి…. మైలారం కొత్త తాండా గ్రామానికి చెందిన పత్లవత్ సుభాష్ (35) గత కొన్ని రోజులుగా మద్యానికి బానిసై కుటుంబీకులను ఇబ్బందులకు గురిచేస్తుండ‌డంతో కుటుంబ‌స‌భ్యులు ప్రస్తుతం శివధీక్ష శివమాల వెయ్యించారు.

died

శనివారం రోజు తప్పి పడిపోయాడని ధారూర్ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.అయితే ఇవాళ‌ ఉదయం శవమై ధారూర్ స్టేషన్ వాగులో కనిపించాడు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పంచ‌నామా నిర్వహించారు. సుభాష్ కు భార్య సీతాభాయి ఒక కుమారుడు ఉన్నారు. అనంతరం మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాఘవేందర్ తెలిపారు.

Leave a Reply