TG | కేసీఆర్‌ను విచారిస్తే తప్పేంటి

TG | కేసీఆర్‌ను విచారిస్తే తప్పేంటి
TG | కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : ఫోన్ టాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నిస్తే తప్పేంటని, చట్టానికి ఎవరు అతిథులు కారని పీసీసీ అధికార ప్రతినిధి బాస వేణుగోపాల్ యాదవ్ పేర్కొన్నారు. ఈ రోజు కమ్మర్ పల్లి మండల కేంద్రం లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… కేసీఆర్ ను రాజకీయ వేధింపులకు గురి చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిది టీఆర్ఎస్ పార్టీ నాయకులు దిష్టిబొమ్మను దగ్ధం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. మీ పాలను బొందపెట్టి మీ దిష్టిబొమ్మలను తెలంగాణ ప్రజలు పాతాళ లోకంలో పెట్టారని, అయినా బుద్ది లేకుండా ప్రజా పాలన, పేదల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై అర్థము లేని విమర్శలు చేయడం సరికాదన్నారు.
పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎంతమంది నాయకుల్ని రాజకీయంగా వేధించారో మీకు తెలియదా, మీ పాలనను మీ అవినీతిని ప్రశ్నించినందుకు జర్నలిస్టులను ఉద్యమకారులను తలుపులు బద్దలు కొట్టి రాత్రికి రాత్రి ఎత్తుకెళ్ళారని, ఆ దొరతనపు అహంకార పాలనను తెలంగాణ ప్రజలు మరిచిపోరని అన్నారు. పదేళ్ల టీఆర్ఎస్ ప్రభుత్వంలో దాదాపు 400 మంది నాయకులది, వ్యాపార వేత్తలది, సెలబ్రిటీల ఫోన్లు ట్యాపింగ్ చేశారని, సాక్షాత్తు కెసిఆర్ కూతురి భర్త దే ఫోన్ ట్యాపింగ్ చేసారని స్వయంగా కవిత బహబాటంగా చెప్పారని ఇంకా ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి అన్నారు.
సినీ తారలతో పాటు కుటుంబ సభ్యుల వ్యక్తిగత హక్కులను కాలారసారని దొంగ చాటున ఫోన్లు వినే హక్కు మీకెవరిచ్చారని ప్రశ్నించారు. కేటీఆర్ ఏమో చేసే గీస్తే రెండు మూడు ఫోన్లు ట్యాప్ అయ్యిండొచ్చు దానికి ఇంత పెద్ద రాదాంతమా అంటూ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడని ఆరోపించారు. పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో వ్యవస్థలను సర్వ నాశనము చేసారన్నారు. ఈ సమావేశంలో గ్రామ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు గణేష్ గౌడ్, అజ్మత్ పాషా, నల్ల సాయికుమార్ గుప్తా, వేములవాడ జగదీష్, దాసరి రాకేష్, కిషన్ గౌడ్, పూజారి శేఖర్, ముత్యాల చంద్రకాంత్, పీర్ల అరవింద్, ఎడ్ల దీపక్ తదితరులు పాల్గొన్నారు.
