28th Ward | చెత్త సేకరణకు రాని ట్రాలీలు..

28th Ward | బెల్లంపల్లి టౌన్, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపాలిటీ లోని 28వ వార్డులో 15 రోజులుగా చెత్త సేకరణ వాహనం రాకపోవడంతో బస్తీవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో బస్తీలోని పలు విధుల్లో చిత్త డంపు పెరిగిపోయి దుర్గంధం వెదజల్లుతోంది. దీంతో బస్తివాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విషయాని గమనించిన స్థానిక యువకుడు పసులేటి వెంకటేష్ బస్తీలో పలు విధుల్లో అక్కడక్కడ పేరుకుపోయిన చెత్తకుప్పలను తనకు తానుగా తొలగించి ద్విచక్ర వాహనంపై తీసుకుపోయి డొంప్ యాడ్ లో పడేయడం చర్చనీయాంశంగా మారింది. అంతే కాదు మున్సిపాలిటీలో చెత్త సేకరణ పై సంబంధిత అధికారుల నిర్లక్ష్యాన్ని వెలుగెత్తి చాటుతోంది ఇప్పటికైనా మున్సిపల్ కమిషనర్ వెంటనే స్పందించి హనుమాన్ బస్తిలో చిత్త సేకరణ జరిగేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
