Dharna | ఎర్రగట్టు గుట్ట జన్షన్‌లో ధర్నా…

Dharna | భీమారం, ఆంధ్రప్రభ : తెలంగాణ రాష్ట్ర తొలి, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ట దిగజార్చాలని కుట్ర చేస్తూ సిట్ నోటీసులు ఇచ్చిరన్న నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ రోజు వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ ఆధ్వర్యంలో ఎర్రగట్టు గుట్ట జంక్షన్ లో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హాసన్ పర్తి డివిజన్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్స్ , డివిజన్ నాయకులు, మండల మాజీ ప్రజా ప్రతి నిధులు, మండల అనుబంధ కమిటీ నాయకులు, మండలం లోని అన్ని గ్రామాల అధ్యక్షులను, గ్రామ ముఖ్య నాయకులను కేయూ పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు.
