Indhrakeeladri | ఘనంగా ఉద్యోగుల పదవీ విరమణ..

Indhrakeeladri | ఘనంగా ఉద్యోగుల పదవీ విరమణ..

Indhrakeeladri, ఆంధ్రప్రభ : శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సుదీర్ఘకాలం సేవలందించి పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగుల వీడ్కోలు సభ అత్యంత వైభవంగా జరిగింది. మల్లేశ్వర మహా మంటపంలోని 6వ అంతస్తులో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో దేవస్థానం అధికారులు, సిబ్బంది పాల్గొని రిటైర్ అవుతున్న సహచర ఉద్యోగులను ఘనంగా సన్మానించారు. ​భక్తుల సేవలో తరించడం వీరి అదృష్టమని ​ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ బండారు రాంబాబు అన్నారు. పదవీ విరమణ పొందుతున్న శ్రీ పి. ప్రసాద్ (డ్రైవర్), ఎం. ఆదిలక్ష్మి (రికార్డ్ అసిస్టెంట్) ల సేవలను కొనియాడారు.

​లోకమాత కనకదుర్గమ్మ సన్నిధిలో దశాబ్దాల కాలం పాటు విధులు నిర్వహించడం సామాన్యమైన విషయం కాదని, ఇది వారి పూర్వజన్మ సుకృతమని ఆయన పేర్కొన్నారు. ​ఎంతో మంది భక్తులు వచ్చే ఈ పుణ్యక్షేత్రంలో, నిరంతరం అంకితభావంతో పని చేసి ఏ మచ్చా లేకుండా పదవీ విరమణ చేయడం అభినందనీయమన్నారు. ​పదవీ విరమణ పొందుతున్న ఉద్యోగులను దేవస్థానం మర్యాదలతో, శాలువాలు జ్ఞాపికలతో అధికారులు ఘనంగా సత్కరించారు. అమ్మవారి శేషవస్త్రాలను, ప్రసాదాలను అందజేసి వారి శేష జీవితం ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షించారు. ​

ఈ సందర్భంగా పదవీ విరమణ పొందుతున్న సిబ్బంది మాట్లాడుతూ.. అమ్మవారి సేవలో ఇన్నేళ్లు గడపడం తమ జీవితానికి దక్కిన గొప్ప వరమని, అధికారుల సహకారం మరువలేనిదని భావోద్వేగానికి లోనయ్యారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ బి వి రెడ్డి, ఎన్. రమేష్ బాబు, డాక్టర్ కె. గంగాధర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ వి. కోటేశ్వరరావు, పర్యవేక్షకులు డివివి సత్యనారాయణ, రాజు, ట్రాన్స్పోర్ట్, ఇంజినీరింగ్ సిబ్బంది, అర్చక స్వాములు పాల్గొన్నారు.

Leave a Reply