Ketepalli | మహిళ దారుణహత్య

Ketepalli | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణలోని నల్గొండ జిల్లా నాంపల్లి మండలం కేతెపల్లిలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళ ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి తగులబెట్టింది. నగేష్ యాదవ్ అనే వ్యక్తికి సుజాత అనే మహిళతో వివాహేతర సంబంధం ఉంది. గొడవల కారణంగా సుజాత నగేష్ యాదవ్ భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించడంతో అక్కడికక్కడే మృతిచెందింది. ఆరునెలల బాబుకు తీవ్రగాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించారు.

Leave a Reply