బంగారం, వెండి ధరలు ఇలా..
ఆంధ్ర ప్రభ వెబ్ డెస్క్ః భారత దేశంలో బంగారం ధర(gold price) రోజు రోజుకు భారీగా పెరుగుతోంది. మునుపు ఎన్నడూ లేనంతగా గోల్డ్ ధర ఎక్కువ అవుతుంది. గోల్డ్ రేట్.. ప్రస్తుతం 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110,330 లకి చేరింది. కాగా 22క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.101,136లకి చేరింది. బుధవారం కంటే బంగారం ధర ఈరోజు రూ.310లు తగ్గింది. అయితే.. బంగారంతోపాటు వెండి ధర కూడా భారీగా పెరిగింది. షేర్ మార్కెట్ నుంచి బులియన్ మార్కెట్‌కు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతుండడంతో బంగారం, వెండి ధరలు పెరుగుతునే ఉన్నాయి. ప్రస్తుతం కేజీ వెండి ధర రూ.126,770ఉంది. నిన్నటి కంటే వెండి ధర రూ.110లు పెరిగింది.
భారత దేశ ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లో 24క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.110,310ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.101,118గా ఉంది. వెండి కేజీ(silver kg) ధర రూ.126,740గా ఉంది.
విజయవాడ(Vijayawada), విశాఖపట్నం(Visakhapatnam)లో 24క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.110,310ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.101,118గా ఉంది. వెండి కేజీ ధర రూ.126,740గాఉంది.
ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్ల బంగార ధర 109,940, 22 క్యారెట్ల ధర రూ.100,778లుగా ఉంది. వెండి కిలో ధర రూ.126,320లుగా ఉంది.
ముంబై(Mumbai)లో 24 క్యారెట్ల బంగార ధర110,130, 22 క్యారెట్ల ధర రూ.100,953లుగా ఉంది. వెండి కిలో ధర రూ.126,540లుగా ఉంది.
చెన్నై(Chennai)లో 24క్యారెట్ల బంగారం ధర రూ.110,450ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.101,246 గా ఉంది. వెండి కిలో ధర రూ.126,910గా ఉంది.
