అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేత

భీమ్‌గల్‌ టౌన్, ఆంధ్రప్రభ : భీంగల్ పట్టణం లోని నిరుపేద కుటుంబానికి చెందిన పిట్ల రాజన్న మరణించడం జరిగింది. వారి కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగ లేకపోవడం తో అంత్యక్రియలు చేయడం కొరకు ఆర్థిక సహాయం చేసేందుకు యోగ గురూజీ పర్శ అనంత్ రావు ముందుకు వచ్చారు. యోగ గురువు తన వ్యక్తిగతంగా రూ 5500 లను వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. యోగ గురువుగా ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్న అనంత్ రావుకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Leave a Reply