Prabhas – Charan | పెద్ది, ఫౌజీ పోటీపడడానికి కారణాలు ఇవే..

Prabhas – Charan | పెద్ది, ఫౌజీ పోటీపడడానికి కారణాలు ఇవే..
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న క్రేజీ మూవీ ఫౌజీ. దీనికి హను రాఘవపూడి డైరెక్టర్. ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న మూవీ పెద్ది. దీనికి బుచ్చిబాబు డైరెక్టర్. ఈ సినిమా మార్చి 27న రిలీజ్ అని ఎప్పుడో ప్రకటించారు. అయితే.. ఇప్పుడు ప్రభాస్ ఫౌజీ, చరణ్ పెద్ది బాక్సాఫీస్ దగ్గర పోటీపడనున్నాయని వార్తలు వస్తున్నాయి. మరి.. ఈ రెండు భారీ, క్రేజీ సినిమాలు వచ్చేది ఎప్పుడు..? అసలు ఈ భారీ పాన్ ఇండియా సినిమాలు పోటీపడడానికి కారణం ఏంటి…?
Prabhas – Charan | సమ్మర్ లో పెద్ది రావడం లేదా..

చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా ఉత్తారాంధ్ర బ్యాక్ డ్రాప్ లో రూపొందుతోన్న మూవీ. ఈ సినిమాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాని మార్చి 27న రిలీజ్ చేయాలి అనుకున్నప్పటికీ.. ఇప్పుడు అనౌన్స్ చేసిన డేట్ కి రావడం లేదని టాక్ బలంగా వినిపిస్తుంది. మరి.. ఎప్పుడు పెద్ది ధియేటర్స్ లోకి వస్తుందంటే.. సమ్మర్ లో మే లేదా జూన్ అని వినిపించింది. అయితే.. కొత్తగా దసరా సీజన్ లో రిలీజ్ చేస్తే.. బాగుంటుందని మేకర్స్ ఆలోచిస్తున్నారని.. పెద్ది సమ్మర్ లో రావడం లేదు.. దసరాకి రానుందనేది కొత్త వార్త. ఈ న్యూస్ వైరల్ అయ్యింది.
Prabhas – Charan | దసరాకి ఫౌజీ..

ఇక ఫౌజీ విషయానికి వస్తే.. ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందుతోన్న మూవీ. ఇందులో ప్రభాస్ బ్రిటీష్ సైనికుడుగా నటిస్తున్నాడని తెలిసింది. అలాగే బ్రాహ్మణ యువకుడుగా కనిపిస్తాడని కూడా టాక్ వినిపిస్తోంది. ఈ భారీ సినిమాను ఆగష్టులో రిలీజ్ చేయాలి అనుకున్నారు. ఆమధ్య ఆగష్టు 15న ఫౌజీ రిలీజ్ అంటూ ప్రచారం జరిగింది. ఇప్పుడు ఆగష్టు 15న ఫౌజీ వచ్చే పరిస్థితి కనిపించడం లేదనేది ఇండస్ట్రీ ఇన్ సైడ్ న్యూస్. కొత్తగా ఫౌజీ దసరాకి రాబోతుందని.. అదే జరిగితే.. పెద్ది, ఫౌజీ ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పోడీపడతాయని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తోంది.
Prabhas – Charan | రెండింటిలో వచ్చేది ఒకటే..

మరి.. నిజంగా ఈ రెండు సినిమాలు పోటీపడతాయా అంటే.. పోటీపడే ఛాన్స్ ఉంది. కాకపోతే.. సాధ్యమైనంత వరకు పోటీపడకుండానే చూసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే.. పెద్ది సినిమా మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో రూపొందుతోంది. ఫౌజీ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అంటే.. దాదాపుగా ఈ రెండు సినిమాల నిర్మాణం మైత్రీలోనే జరుగుతుంది.
అందుచేత ఒకే సంస్థ నుంచి దసరాకి రెండు సినిమాలు రాకపోవచ్చు అంటున్నారు సినీ జనాలు. గతంలో సంక్రాంతికి ఈ సంస్థ నుంచే వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి అనే రెండు సినిమాలు రిలీజ్ చేశారు. అయితే.. దసరాకి అలా జరగకపోవచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి. అందుచేత పెద్ది, ఫౌజీ.. ఈ రెండింటిలో ఏదో ఒకటే దసరాకి వస్తుందని టాక్. మరి.. ప్రచారంలో ఉన్న కన్ ఫ్యూజన్ పై త్వరలో క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
