D46 Canal | కాలువలో బాలిక మృత దేహం లభ్యం
D46 Canal | కాలువలో బాలిక మృత దేహం లభ్యం
D46 Canal | ఎడపల్లి, ఆంధ్రప్రభ : ఎడపల్లి మండలం ఏఆర్పి క్యాంప్ గ్రామ శివారు ప్రాంతంలో గల నిజాం సాగర్ డీ46 కెనాల్ లో ఈ రోజు గుర్తుతెలియని బాలిక మృతదేహం లభ్యమవ్వడం స్థానికంగా కలకలం రేపింది. బాలిక మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు స్థానిక పోలీస్ స్టేషన్ కు సమాచారాన్ని చేరవేశారు.
ఘటన స్థలాన్ని బోధన్ రూరల్ సీఐ విజయబాబుతో పాటు ఎస్ఐ ముత్యాల రమా పరిశీలించారు. బాలిక వద్ద ఆచూకీకి సంబంధించి ఎలాంటి ఆధారం లభించకపోవడంతో అన్ని పోలీస్ స్టేషన్ లకు సమాచారం చేరవేసినట్లు సిఐ తెలిపారు. ఆచూకీ తెలిస్తే ఎడపల్లి పోలీసులకు సమాచారం అందించాలని సి.ఐ సూచించారు.
