Adilabad | కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు…

Adilabad | కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు…
Adilabad | లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికలు లక్షేట్టిపేట చరిత్రలో రోజుకో మలుపు తిరుగుతున్నాయి. మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ఎస్సీ జనరల్ కు కేటాయించడంతో ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్ ల ఎత్తుగడలు ఊహలకు అందని విధంగా మారుతున్నాయని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. మూడు రోజుల క్రితం బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ ను హైదరాబాద్ లో కలిసి పలువురు ఆ పార్టీ కండువా కప్పుకున్నారు.
వీరిలో చైర్మన్ పదవికి పోటీ చేసే అభ్యర్థి ఉన్నట్లు ప్రచారం కూడా జరిగింది.నేడు అనూహ్యంగా బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు, మాజీ వైస్ ఎంపిపి పాదం శ్రీనివాస్, సీనియర్ నాయకులు, మాజీ కౌన్సిలర్ చాతరాజు రాజన్న, 6 వ వార్డ్ అధ్యక్షులు మనోహర్,ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ కాంగ్రెస్ లో చేరి మున్సిపాలిటీ పాలక వర్గ పగ్గాలు చేపట్టడంలో వెనుకాడేది లేదని తేల్చి చెప్పినట్లు అయ్యిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికలో జరిగిన కొన్ని పొరపాట్లు నేడు పలు రకాల సవరింపులకు కారణమవుతున్నాయనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.
