Jainoor | ఉపాధి హామీ పనులను ప్రారంభం…

Jainoor | ఉపాధి హామీ పనులను ప్రారంభం…

Jainoor | జైనూర్, ఆంధ్రప్రభ : కొమురం భీ0 అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని దుబ్బగూడ గ్రామపంచాయతీలో బుధవారం నూతన సర్పంచ్ మడవి కౌసల్య భీమ్రావ్ ఉపాధి హామీ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతికూలికి ఉపాధి హామీ పనులు కల్పించేలా వారికి ఉపాధి అందించేలాచూడాలని పనుల్లో తేడాలు రాకుండా పనులు నిర్వహించాలని సర్పంచ్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ పెందూర్ అనసూయ, ఫీల్డ్ అసిస్టెంట్ సిహెచ్ సుభాష్, ఉపాధి హామీ కూలీలు పాల్గొన్నారు.

Leave a Reply