TG | తొలిరోజు నామినేషన్ల ప్రక్రియను పరిశీలన…

TG | తొలిరోజు నామినేషన్ల ప్రక్రియను పరిశీలన…

  • ఎన్నికల నిబంధనల ప్రకారం నామినేషన్లు దాఖలు చేయాలి,
  • జిల్లా కలెక్టర్ & జిల్లా ఎన్నికల అధికారి బాదావత్ సంతోష్

TG | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడానికి వచ్చిన సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా అధికారులు పూర్తి సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి బాదావత్ సంతోష్ అన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ల స్వీకరణ కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ఏర్పాట్లను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ బాదావత్ సంతోష్, మాట్లాడుతూ,… జిల్లాలోని నాగర్‌కర్నూల్, కల్వకుర్తి, కొల్లాపూర్ మున్సిపాలిటీలకు సంబంధించిన నామినేషన్ల స్వీకరణ కోసం ఆయా నియోజకవర్గాల్లో అన్ని రకాల సౌకర్యాలు కల్పించినట్లు తెలిపారు. నామినేషన్ల ప్రక్రియలో ఎన్నికల కమిషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని అధికారులకు సూచించారు. నామినేషన్ పత్రాల్లో పై అభ్యర్థులకు ఎలాంటి సందేహాలు ఉన్నా హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించేలా అవగాహన కల్పించాలని, నామినేషన్ దాఖలుకు అవసరమైన అన్ని పత్రాలపై ముందుగానే సూచనలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఎన్నికల నియమావళి ప్రకారం నామినేషన్ ప్రక్రియ పూర్తిగా నిష్పక్షపాతంగా, శాంతియుత వాతావరణంలో జరిగేలా కృషి చేయాలని పలు సూచనలు చేశారు. నాగర్ కర్నూల్ మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, తాహసిల్దార్ తబితా, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply