Mepma | నూతన వ్యాపారాలపై దృష్టి సారించాలి.

Mepma | నూతన వ్యాపారాలపై దృష్టి సారించాలి.
- జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి….
Mepma | బోధన్, ఆంధ్రప్రభ : మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి వ్యాపార రంగాలపై దృష్టి సారించాలని జిల్లా ఇలాత్రిపాఠీ అన్నారు. ఈ రోజు బోధన్ పట్టణంలో మెప్మా(Mepma) స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేని రుణాలను పంపిణి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ…. మహిళలు ఆత్మ గౌరవంగా తల ఎత్తుకోవాలంటే ఆర్థిక క్రమశిక్షణ అవసరమని ఆమె అన్నారు.
ఇందుకోసం మహిళలు వ్యాపార రంగాలలో మెలుకువలు నేర్చుకోవాలని సూచించారు. వ్యాపార రంగాలలో పోటీ ఉన్నప్పటికీ తగిన మెలుకువలు పెంపొందించు కోవడం ద్వారా వాటిని అధికమించవచ్చన్నారు. ప్రభుత్వం బోధన్ పట్టణంలోని మహిళలకు రెండు కోట్ల రుణాల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డి, డీఆర్డీఏ పీడీ సాయ గౌడ్, బోధన్ సబ్ కలెక్టర్ వికాస్ మహాతో ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహేర్ బిన్ ఉన్నారు.
