TDP | ఎన్‌టీఆర్‌ ఆశయాలు స్ఫూర్తిదాయ‌కం

TDP | ఎన్‌టీఆర్‌ ఆశయాలు స్ఫూర్తిదాయ‌కం

  • టీడీపీ జిల్లా నాయ‌కుల ఘననివాళి

TDP | కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : తెలుగుజాతి ముద్దుబిడ్డ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి కార్యక్రమాన్ని ఆదివారం జిల్లా తెలుగుదేశం పార్టీ ఘనంగా నిర్వహించింది. పార్టీ జిల్లా అధ్యక్షులు గుడిశ క్రిష్ణమ్మ ఆధ్వర్యంలో కర్నూలులోని జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

TDP

ముందుగా పార్టీ కార్యాలయంలో ఎన్‌టీఆర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ కార్యాలయం ఎదుట ఉన్న ఎన్‌టీఆర్‌ విగ్రహం వద్ద పూలమాలలు వేసి పుష్పాంజలి ఘటించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పూల నాగరాజు యాదవ్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమిశెట్టి వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.ఈ. ప్రభాకర్‌, రాష్ట్ర కార్యదర్శి వై. నాగేశ్వరరావు యాదవ్‌, కర్నూలు నగర అధ్యక్షులు కొరకంచి రవికుమార్‌, ఆకెపోగు ప్రభాకర్‌, కె.వి. సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు కె. లక్ష్మీనారాయణ, సంజీవలక్ష్మి, కె. నాగేంద్ర, డి. జేమ్స్‌, విజయకుమార్‌, పి. రవికుమార్‌, సోమిశెట్టి నవీన్‌, స్వామిరెడ్డి, అబ్బాస్‌, కె. పరమేష్‌, పద్మలతారెడ్డి, రాజశేఖరరెడ్డి, పాలారాజ్‌, సత్రం రామకృష్ణుడు, హనుమంతరావు చౌదరి, జె. తిరుపాల్బాబు, మల్లెల పుల్లారెడ్డి, రాంబాబు, గణేష్‌, ఆదిత్యారెడ్డి, అక్షయకుమారి, విజయలక్ష్మి తదితరులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply