Utkoor | కుక్కల దాడిలో ఆవుమృతి..

Utkoor | కుక్కల దాడిలో ఆవుమృతి..

  • రూ 40 వేలనష్టం.

Utkoor | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో కుక్కల దాడిలో ఆవు మృతి చెందిన సంఘటన ఇవాళ‌ చోటు చేసుకుంది. కుక్కల దాడి ఘ‌ట‌న‌లు రోజు రోజుకు విజృంభిస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. పశువులు, చిన్నారులపై కుక్క‌లు దాడి చేసి గాయపరిచిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.

ఊట్కూర్ మండల కేంద్రంలోని శివాజీ నగర్ వీధికి చెందిన బాధిత రైతు చాకలి కనకప్ప తన ఆవు ఇంటి వద్ద ఈనెల 16న కట్టి ఉంచగా కుక్కలు గుంపులుగా వచ్చి దాడి చేయడంతో తీవ్ర గాయాలు కాగా, పశు వైద్య సిబ్బంది చికిత్సలు నిర్వహించగా ఇవాళ‌ మృతిచెందినట్లు తెలిపారు. కుక్కల దాడిలో మృతిచెందిన ఆవు విలువ సుమారు రూ.40వేలు ఉంటుందని వాపోయాడు. బాధితుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని వార్డు సభ్యురాలు లావణ్యతో పాటు పలువురు రైతులు డిమాండ్ చేశారు. ఊట్కూర్ లో కుక్కల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply