2menkilled | జంట హత్యల వెనుక భయంకర కథ

2menkilled | జంట హత్యల వెనుక భయంకర కథ
2menkilled | గండవరం గ్రామంలో సంచలనం రేపిన ఘటన
పాత కక్షలే ప్రాణాంతకమా?
గ్రామాల్లో పెరుగుతున్న ఘర్షణలు
కుటుంబాల వేదన… మిగిలింది కన్నీళ్లు
కక్షలకు ముగింపు ఎప్పుడు?
ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ :
ఆ ఉదయం గండవరం గ్రామ శివారులో కనిపించిన ఇద్దరు యువకుల మృత దేహాలు గ్రామాన్ని ఒక్కసారిగా భయాందోళనలకు గురి చేశాయి.
వెంకటేష్, బాలవెంకయ్య..వేర్వేరు ప్రాంతాలకు చెందిన వ్యక్తులు. కానీ వారిద్దరికీ ఒకే రూపంలో జీవితం ముగిసిపోతుందని ఎవరు ఊహించి ఉండరు. వారి కుటుంబాలకు వారే ఆశాదీపాలు. వారి గ్రామాలకు వారు బాగా పరిచయమున్న ముఖాలు. కానీ ఒక్క రాత్రికి రాత్రి.. పాత కక్షలు వారి జీవితాలను బలిగొన్నాయి.

దర్యాప్తును ప్రారంభించిన పోలీసుల అనుమానం ముందుగా పాత కక్షల వైపే మళ్లింది. ఆ కక్షల మూల్యం ఎంత? అసలు ఆ కక్షలలోని తీవ్రత ఎందుకింత? చిన్న గొడవలు… మాటల తగాదాలు… గర్వం… ఇవన్నీ కలిసినప్పుడు అవి క్షణాల్లో ప్రాణాంతకంగా మారే ప్రమాదముంది.
గ్రామాల్లో ఇలాంటి సంఘటనలు కొత్తవి కావు. ఒక చిన్న వివాదం, కాస్త అహంకారం… అంతే. సమస్యను మాట్లాడుకుని పరిష్కరించుకోవాల్సిన చోట, కోపం, ఉక్రోషం పెల్లుబికితే… కాఠిన్యం జడలు విప్పితే… ఫలితం ఇలాగే ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరిగిందా? అన్న సందేహం గ్రామంలో ప్రతి ఒక్కరినీ వెంటాడుతోంది.
మృతుల కుటుంబాల్లో వేదన మాటల్లో చెప్పలేనిది. “నిన్నటి వరకు మాట్లాడిన వాళ్లు… ఈ రోజు మామధ్య లేరు” అన్న నిజం అంగీకరించడం అంత ఈజీ కాదు. వారి ఇళ్లలో ఇప్పుడు మిగిలింది కేవలం జ్ఞాపకాలు, కన్నీళ్లు మాత్రమే.
ఇలాంటి ఘటనలు మనకు ఒక పెద్ద పాఠం చెబుతున్నాయి. కక్షలు, ప్రతీకారాలు చివరికి ఎవరినీ గెలిపించవు. ఒకరి ప్రాణం తీసిన వారు ఏనాటికైనా చట్టం ముందు నిలబడాల్సిందే.
పోలీసులు నిందితులను పట్టుకునేందుకు గాలిస్తున్నారు.
