సాంకేతిక నిర్మాత రాజీవ్ గాంధీ

సాంకేతిక నిర్మాత రాజీవ్ గాంధీ
చౌటుప్పల్, ఆంధ్రప్రభ :
ఆధునిక భారత సాంకేతిక నిర్మాత స్వర్గీయ రాజీవ్ గాంధీ అని చౌటుప్పల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు ఆకుల ఇంద్రసేనారెడ్డి కొనియాడారు. రాజీవ్ ట్రస్ట్ ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ స్మారక భవనంలో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 36వ వర్ధంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. భారతదేశాన్ని ప్రపంచ దేశాల సరసన అగ్రగామిగా నిలిపేందుకు రాజీవ్ గాంధీ సాంకేతిక విప్లవాన్ని, కంప్యూటర్ యుగాన్ని దేశంలోకి ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. యువతకు రాజకీయాల్లో భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ఓటు హక్కు వయోపరిమితిని 21 ఏళ్ల నుండి 18 ఏళ్లకు తగ్గించిన ఘనత ఆయనదేనని, రాజీవ్ గాంధీ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షులు సుర్వి నరసింహ, రాజీవ్ ట్రస్ట్ ఉపాధ్యక్షులు జిండ్రు అంజిరెడ్డి, ప్రధాన కార్యదర్శి ఎంఏ . ఖయ్యూం, కార్యదర్శి నల్ల నరసింహ, నాయకులు చింతల సాయిలు, ఆవుల యేసు దాసు, కంచర్ల జంగయ్య, మాదని గోపాల్, బండమీద ఎల్లయ్య, ఎండీ చాంద్ పాషా, ఊదరి యాదయ్య తదితరులు పాల్గొన్నారు.
