118Seats | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్
118Seats | ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్
118Seats | ఆంధ్రప్రభ వెబ్‌డెస్క్ : రేపు (మే 4) తమిళనాడుతో పాటు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం మరియు పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ రేపు జరగనుంది. ఈ ఫలితాల కోసం కేవలం ఆయా రాష్ట్రాల ప్రజలే కాకుండా, దేశవ్యాప్తంగా ఉన్న రాజకీయ విశ్లేషకులు మరియు సామాన్యులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచే ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే అన్ని రకాల భద్రతా మరియు సాంకేతిక ఏర్పాట్లను పూర్తి చేసింది.
సోమవారం తమిళనాడు రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది. ఈ ఎన్నికలు తమిళనాడులో ముఖ్యమైన రాజకీయ మార్పులకు సంకేతంగా నిలుస్తాయని భావిస్తున్నారు. కౌంటింగ్ నేపథ్యంలో స్ట్రాంగ్ రూమ్స్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. రేపు తమిళనాడులో ఓట్ల లెక్కింపు జరగనుంది. కానీ ఇప్పుడే ఎవరు గెలుస్తారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. తమిళనాడులో మొత్తం 234 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ప్రధాన పార్టీలైన డీఎంకే (స్టాలిన్ నాయకత్వం), ఏఐఏడీఎంకే కూటమి, కొత్తగా వచ్చిన టీవీకే (విజయ్ పార్టీ) ఈ ఎన్నికల్లో పోటీ పడ్డారు. ప్రభుత్వం ఏర్పాటుకు 118 సీట్లు అవసరం . అయితే ఈ మ్యాజిక్ ఫిగర్‌ను ఎవరు దాటుతారో.. ఎవరు గద్దెనక్కుతారో మరొక రోజు ఆగితే తేలనుంది.
ఎగ్జిట్ పోల్స్ ఏమంటున్నాయి?
డీఎంకే కూటమి మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. డీఎంకేకు సుమారు 120+ సీట్లు వచ్చేలా ఉన్నట్లు అంచనాలున్నాయి. అయితే టీవీకే (విజయ్ పార్టీ) మంచి ప్రభావం చూపించి “కింగ్‌మేకర్” అవుతుందనే అంచనాలు కూడా ఉన్నాయి. ఏఐఏడీఎంకే కూడా మంచి పోటీ ఇస్తుందనే విశ్లేషణ ఉంది. ఉదయం 9 గంటల నుంచే ఫలితాల వెల్లడి మొదలై ఫైనల్ రిజల్ట్ సాయంత్రానికి పూర్తవుతుంది.
