అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య..

కమ్మర్ పల్లి, ఆంధ్రప్రభ : కమ్మర్ పల్లి మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనికి చెందిన యువకుడు ఉరి వేసుకుని ఆత్మహత్య కు పాల్పడిన ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. కమ్మర్ పల్లి ఎస్ఐ సిహెచ్. సతీష్ తెలిపిన కథనం ప్రకారం… ముద్దంగుల అశోక్ ( 29 ) తీవ్ర అనారోగ్యం, ఆర్థిక సమస్యలు మరియు మద్యపాన వ్యసనంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. అశోక్ గత కొంతకాలంగా మూర్ఛ ( ఫిట్స్ ) వ్యాధితో బాధపడుతున్నా డు, వివిధ ప్రాంతాల్లో వైద్యం చేయించిన నయం కాకపోవడంతో మానసిక వేదనకు గురై మద్యానికి బానిసైనట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు.

గత రెండు నెలలుగా ఏ పని చేయకుండా, రోజంతా మద్యం తాగుతూ ఉన్నాడని, అనారోగ్యం మరింత తీవ్రం కావడంతో జీవితం పై విరక్తి చెందాడని, ఈ క్రమంలో తెల్లవారుజామున కుటుంబ సభ్యులు బయట నిద్రిస్తున్న సమయంలో అశోక్ ఇంట్లోకి వెళ్లి చీరతో సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. తెల్లవారుజామున మృతుడి భార్య సంధ్య ఇంట్లోకి వెళ్లి చూడగా అశోక్ ఫ్యాన్ కు వేలాడుతూ కనిపించడానీ, వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని కిందకు దించినప్పటికీ అప్పటికే అతను మృతి చెందాడని, మృతుడి భార్య సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కమ్మర్పల్లి ఎస్ఐ. సిహెచ్. సతీష్ తెలిపారు.