రెండేళ్లలో అభివృద్ధి, సంక్షేమంపై ఇంటింటి ప్రచారం..

బంటుమిల్లి, ఆంధ్రప్రభ : పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం అర్తమూరు గ్రామంలో నిర్వహించిన “రెండేళ్ల నమ్మకం – సంక్షేమ విజయాలు, ప్రజా పాలన… ఇంటింటికీ అభివృద్ధి” కార్యక్రమంలో కృష్ణాజిల్లా ఇన్‌చార్జ్ మంత్రివర్యులు వాసవిశెట్టి సుభాష్, పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు, ప్రజలకు అందించిన సేవలను వివరించి, ప్రభుత్వ విజయాలను ప్రజలతో పంచుకోవడం జరిగింది.

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా, అభివృద్ధే ధ్యేయంగా పరిపాలన కొనసాగుతోంది. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను దశలవారీగా అమలు చేస్తూ, ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తున్నాము.

రైతులు, మహిళలు, యువత, విద్యార్థులు, వృద్ధులు, కార్మికులు సహా అన్ని వర్గాల ప్రజలకు ప్రయోజనం చేకూరేలా అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాము. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో రహదారులు, తాగునీరు, విద్య, వైద్యం, విద్యుత్, వ్యవసాయం తదితర రంగాల్లో గణనీయమైన పురోగతి సాధిస్తున్నాము.

బంటుమిల్లి మండలంలో వివిధ అభివృద్ధి పనులను చేపట్టడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రతి అర్హుడికి అందేలా చర్యలు తీసుకుంటున్నాము. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను నేరుగా తెలుసుకుని, వాటి పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చాము.

ఇంటింటి ప్రచార కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వం రెండేళ్లలో సాధించిన విజయాలు, అమలు చేసిన సంక్షేమ పథకాలు, చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన కరపత్రాలను ప్రజలకు అందజేసి ప్రభుత్వ పనితీరును వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, మహిళలు, యువత మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.