Yoga | ప్రత్యేక యోగా కార్యక్రమంలో హోంమంత్రి అనిత
Yoga | ప్రత్యేక యోగా కార్యక్రమంలో హోంమంత్రి అనిత
Yoga | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విజయవాడ బీఆర్టీఎస్ రోడ్డులో పోలీస్ థీమ్‌తో ప్రత్యేక యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత పాల్గొని యోగా ప్రాముఖ్యతను వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘యోగాంధ్ర-2026’ కార్యక్రమాలు జూన్ 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా కొనసాగనున్నాయని మంత్రి తెలిపారు. ప్రజలందరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

యోగా కేవలం వ్యాయామం మాత్రమే కాదని, అది ఆరోగ్యకరమైన జీవన విధానమని వంగలపూడి అనిత పేర్కొన్నారు. యోగా ద్వారా శారీరక దృఢత్వంతో పాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత కూడా పెరుగుతాయని వివరించారు.

