Yadadri | ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కలిసిన సర్పంచ్ ప్రదీప్ జీ
Yadadri | ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డిని కలిసిన సర్పంచ్ ప్రదీప్ జీ
- ప్రజల సమస్యల పరిష్కారం కోసం సహకారం అందిస్తా
- ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
Yadadri | చౌటుప్పల్, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలోని స్వాములవారి లింగోటం గ్రామ నూతన యువ సర్పంచ్ భీమిడి ప్రదీప్ జీ మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానం చేశారు. ఈ సందర్భంగా రాజగోపాల్ రెడ్డి సర్పంచ్ గా విజయం సాధించిన ప్రదీప్ జీని అభినందిస్తూ శాలువాతో సన్మానించారు.
గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం తన వంతు సహకారం అందిస్తానని ఎమ్మెల్యే తెలిపారు. తనపై ఎంతో నమ్మకంతో సర్పంచ్ గా గెలిపించిన గ్రామ ప్రజలకు ప్రదీప్ జీ కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే సహకారంతో గ్రామంలోని అన్ని సమస్యలను పరిష్కరించి అభివృద్ధి చేస్తానని, ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు ప్రజలకు అందుబాటులో ఉండి నిరంతరం కృషిచేస్తానని సర్పంచ్ ప్రదీప్ జీ తెలిపారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గం ఎన్నికల ఇన్చార్జి పబ్బు రాజు గౌడ్, మాజీ జెడ్పిటిసి చిలుకూరి ప్రభాకర్ రెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఉప్పు భద్రయ్య, మాజీ సింగిల్ విండో చైర్మన్ చెన్నగోని అంజయ్య, మొగుదాల రమేష్ గౌడ్, దేప విప్లవ కుమార్, మాజీ ఉపసర్పంచ్ గంగాపురం గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.
