‘శబ్దం’తో భయపెట్టనున్న ఆది.. కొత్త సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ !
దర్శకుడు అరివళగన్ – హీరో ఆది పినిశెట్టి కాంబినేషన్‌లో వచ్చిన ‘వైశాలి’ సూపర్ హిట్‌గా నిలిచింది. ఇదిలా ఉంటే వీరిద్దరి కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. దర్శకుడు అరివళగన్ – హీరో ఆది పినిశెట్టి కాంబినేషన్ లో సూపర్ నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘శబ్దం’ తెరకెక్కనుంది. కాగా, ‘వైశాలి సినిమాలో ‘వాటర్’ హారర్ ఎలిమెంట్‌తో అందరినీ ఆకట్టుకున్న దర్శకుడు అరివళగన్.. ఈ సినిమాలో ‘సౌండ్’ని సూపర్ నేచురల్ ఫ్యాక్టర్‌గా ఉపయోగించారు.
ఇక ఈ చిత్రాన్ని 7G ఫిల్మ్స్ బ్యానర్‌పై శివ నిర్మిస్తున్నారు. తాజాగా ‘శబ్దం’ విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ఈ సినిమాని తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.
ఈ సినిమాలో లక్ష్మీ మీనన్ కథానాయికగా నటిస్తుండగా.. సిమ్రాన్, లైలా, రెడిన్ కింగ్స్లీ, ఎంఎస్ భాస్కర్, రాజీవ్ మీనన్ వంటి ప్రముఖ నటీనటులు నటిస్తున్నారు. సంగీత దర్శకుడు తమన్ ఈ చిత్రానికి అద్భుతమైన సంగీతాన్ని అందించారు. ఇక ఎన్ సినిమాస్ ద్వారా ఈ చిత్రాన్ని ఆంధ్ర & తెలంగాణా లో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.