Woman | ఫోటో దిగుతూ…
Woman | ఫోటో దిగుతూ…
Woman | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : ఓ వేడుకలో ఆనందంగా ఉన్న సమయంలో ఒక మహిళకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. కొద్దిసేపటితో ఆమె ప్రాణాలు కోల్పోయింది. తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మంలో జరిగిన ఓ గృహప్రవేశ వేడుకలో విషాద ఘటన చోటుచేసుకుంది. గాంధీ చౌక్ ప్రాంతానికి చెందిన బొమ్మ సుష్మితా పుట్టకోట ప్రాంతంలో జరిగిన ఫంక్షన్కు హాజరయ్యారు. వేదికపై ఫొటోలు దిగుతున్న సమయంలో గుండెపోటు వచ్చి అక్కడికక్కడే కుప్పకూలారు. గతంలో గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆమెకు ఫేస్మేకర్ అమర్చాలని వైద్యులు సూచించినా, బీపీ అదుపులో లేకపోవడంతో చికిత్స వాయిదా వేశారు. మందులతోనే కాలం గడుపుతున్న ఆమె ఫంక్షన్కు వచ్చిన కొద్దిసేపటికే ప్రాణాలు కోల్పోయారు.
