Warns | హైడ్రా పేరుతో దందా చేస్తే జైలుకే…. హైడ్రా చీఫ్ రంగ‌నాథ్ వార్నింగ్

హైదరాబాద్: హైడ్రా పేరుతో ఇక సెటిల్‌మెంట్లు చేస్తే ఊరుకునేది లేదని హైడ్రా కమిషనర్ రంగనాథ్ హెచ్చరించారు. వంశీరామ్ బిల్డర్స్‌పై ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన ఫిర్యాదు అందిందని తెలిపారు. ఈ విషయంపై చర్యలు ప్రారంభించినట్లు చెప్పారు. నేడు ఆయ‌న త‌న కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ, ఒక్క వంశీరామ్ బిల్డర్స్ మాత్రమే గాకుండా, రాజ్‌పుష్ప వంటి బిల్డర్స్‌కు కూడా బఫర్ జోన్లలో డంపింగ్ చేశారని రంగనాధ్ తెలిపారు. వారందరికి ఆదేశాలు జారీ చేశామని చెప్పారు. హై డ్రా పేరుతో సెటిల్ మెంట్లు చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఇప్పటికే చాలా కేసులు నమోదయ్యాయని అలాంటి అధికారులు ఉంటే ఉద్యోగం నుంచి తొలగిస్తామని రంగనాథ్ వార్నింగ్ ఇచ్చారు.

Leave a Reply