Vangaveeti | రాజకీయాల్లోకి.. వంగవీటి ఆశా కిరణ్..

Vangaveeti | రాజకీయాల్లోకి.. వంగవీటి ఆశా కిరణ్..
Vangaveeti, ఎన్టీఆర్ బ్యూరో, ఆంధ్రప్రభ : కుల, మత రాజకీయాలకు అతీతంగా రాష్ట్ర వ్యాప్తంగా అందరూ అభిమానించి ఆరాధించే నాయకుడు వంగవీటి మోహన రంగా (Vangaveeti Mohana Ranga) అని వంగవీటి రంగా కుమార్తె వంగవీటి ఆశా కిరణ్ (Vangaveeti Ashaa Kiran) పేర్కొన్నారు. రంగా ఆసియా ల కోసం ప్రతి ఒక్కరూ పని చేయాలని ఆమె పిలుపునిచ్చారు. విజయవాడలోని రాఘవయ్య పార్క్ దగ్గర ఉన్న వంగవీటి రంగా విగ్రహానికి ఆమె ఆదివారం పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం నిర్వహించిన పత్రిక విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. తాను రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించారు. రాధా (Radha – Ranga) రంగా మిత్ర మండలి ఆహ్వానం మేరకు కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు తెలిపారు. రంగా ఆశయ సాధన కోసం కృషి చేస్తానని, పబ్లిక్ లైఫ్ కి కొంత కాలంగా దూరంగా ఉన్నాట్లు తెలిపారు. ఇక పై పూర్తిగా తన జీవితమంతా ప్రజల మధ్యలోనే గడుపుతానని చెప్పారు. ప్రజలకు ఏ కష్టం వచ్చినా తాను అండగా ఉంటానని చెప్పారు. రాధా రంగా మిత్రా మండలి మధ్య గ్యాప్ ఉందని, ఆ గ్యాప్ ఫుల్ ఫిల్ చేయడానికి తాను వస్తున్నాట్లు వివరించారు. కులం, మతం బేధం లేకుండా సహాయం చేసిన ఏకైక వ్యక్తి వంగవీటి రంగా అన్న ఆమె రంగా సిద్ధాంతాలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకువెళ్తామని చెప్పారు.
