Prakash Raj | నా ఓటు కోసం ఏం చేయాలి..?
65 లక్షల మందిలో నేనూ ఒకడిని..
ఎస్ఐఆర్పై నటుడి ప్రశ్నలు
Prakash Raj | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : బెంగళూరులో తన ఓటు తొలగించారని నటుడు ప్రకాశ్‌రాజ్ ఆరోపించారు. పుట్టి పెరిగిన బెంగళూరు నియోజకవర్గంలోనే తన ఓటు గల్లంతైందని పేర్కొంటూ ఆయన ఓ వీడియో విడుదల చేశారు.
బెంగళూరులో ఓటు కోల్పోయినట్లు చెబుతున్న 65 లక్షల మందిలో తానూ ఒకడినని ప్రకాశ్‌రాజ్ తెలిపారు. బెంగళూరు నుంచి ఎంపీగా పోటీ చేసిన తన ఓటే తొలగించారని పేర్కొన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియలో అసలు ఏం జరుగుతోందని ఆయన ప్రశ్నించారు.
తన ఓటును తిరిగి పొందేందుకు ఎలాంటి పత్రాలు సమర్పించాలో తెలుసుకుంటానని ప్రకాశ్‌రాజ్ చెప్పారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని పౌరుల ఓట్లను తొలగిస్తున్నారని ఆయన ఆరోపించారు. తన ఓటు తొలగింపుపై ప్రకాశ్‌రాజ్ తీవ్రంగా స్పందించారు. “నువ్వు మా ఓట్లు తొలగించగలవు.. నిన్ను గద్దె దించకుండా మమ్మల్ని అడ్డుకోలేవు” అంటూ వీడియోలో ఘాటు వ్యాఖ్యలు చేశారు.
