Utnoor | మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్‌కు వినతి …

Utnoor | మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్‌కు వినతి …

Utnoor | ఉట్నూర్, ఆంధ్రప్రభ : గోండి ధర్మ గురువు హిరాసుక జయంతి వేడుకలను మాఘ శుద్ధ పౌర్ణమి రోజున నిర్వహిస్తామని జయంతి వేడుకలకు ప్రభుత్వపరంగా నిధులు మంజూరు చేయాలని కోరుతూ ఇవాళ ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు ఆధ్వర్యంలో ప్రధాని పురోహిత్ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, పలు జిల్లాల నాయకులు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్‌ను కలిసి వినతి పత్రం ఇచ్చినట్లు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మెస్రం మనోహర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్రంలోని అదిలాబాద్, మంచిర్యాల్, కొమరం భీమ్ ఆసిఫాబాద్, అదిలాబాద్, కరీంనగర్, నిర్మల్ హైదరాబాద్ తదితర జిల్లాలో ఆదివాసి ప్రధాన్ పురోహిత్ ఆదివాసీలు పక్షం రోజులపాటు హిర సుక జయంతి వేడుకలను ఆయా మండలాల్లో నిర్వహిస్తారని రాష్ట్ర ప్రభుత్వం నుండి జయంతి వేడుకలకు నిధులు మంజూరు చేయించాలని మంత్రికి వినతిపత్రం ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నిధుల మంజూరుకు హామీ ఇచ్చినట్లు ఆయన తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో ఆసిఫాబాద్ మాజీ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, ప్రధాన పురోహిత్ రాష్ట్ర సంఘం అధ్యక్షులు మెస్రం మనోహర్, రాష్ట్ర నాయకులు ఆత్రం శేషు నారాయణ, మడావిశంకర్, ఉయిక సుదర్శన్, గేడం నిరంజన్, మెస్రం రవి పాల్గొన్నారని ఆయన తెలిపారు.

Leave a Reply