యూరియా కోసం గంటల తరబడి నిరీక్షణ

వేల్పూర్, ఆంధ్రప్రభ: వేల్పూర్ మండలంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. సోమవారం అమీనాపూర్ గ్రామంలోని సొసైటీ కేంద్రం వద్ద తెల్లవారుజాము నుంచే రైతులు బారులు తీరారు. ఆన్‌లైన్‌లో ముందుగానే నమోదు చేసుకున్నప్పటికీ యూరియా అందకపోవడంతో వేల్పూర్‌తో పాటు పోచంపల్లి, అక్బూర్, చుట్టుపక్కల గ్రామాల నుంచి రైతులు సొసైటీ కేంద్రానికి చేరుకుని గంటల తరబడి వేచి ఉన్నారు.

సమయానికి ఎరువులు అందకపోతే పంటలకు నష్టం వాటిల్లే అవకాశం ఉందని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. యూరియా నిల్వలను తక్షణమే అందుబాటులోకి తీసుకురావడంతో పాటు రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పంపిణీ చేయాలని అధికారులను కోరారు.

రైతుల ఆందోళన

యూరియా కోసం తెల్లవారుజాము నుంచే వేచి ఉండాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంటలకు అవసరమైన సమయంలో ఎరువులు అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.