వరంగల్ కమిషనరేట్ పరిధిలో ఇద్దరు ఎస్ఐల సస్పెన్షన్

నర్సంపేట, ఆంధ్రప్రభ : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అవినీతి పాలవుతున్నారనే ఆరోపణలతో ఇద్దరు ఎస్సైలు సస్పెన్షన్ గురయ్యారు. తప్పు చేస్తే ఉపేక్షించేది లేదు అంటూ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరిస్తూ ఉన్న మిగతా అధికారుల తీరు మాత్రం మారడం లేదు. అవినీతి ఆరోపణలతో నర్సంపేట పోలీస్ స్టేషన్ ఎస్. ఐ రవి కుమార్ తో పాటు, ఎల్కతుర్తిలో విధులు నిర్వహించి ప్రస్తుతం సి.ఏ.ఆర్ విభాగంలో అటాచ్డ్ లో ఉన్న ప్రవీణ్ కుమార్ పై వచ్చిన ఆరోపలతో సమగ్ర విచారణ జరిపి వచ్చిన ఆరోపణలు నిర్ధారణ కావడంతో ఇద్దరు ఎస్సైలను సస్పెన్షన్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీతిసింగ్ గత రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.
ఏడాది క్రితం నర్సంపేట పోలీస్ స్టేషన్ సీఐ రమణమూర్తి, ఎస్సై రవికుమార్ లపై అవినీతి ఆరోపణలు అధికారులకు చేరినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టలేదని అపవాది సైతం ఉంది. నేడు ఎస్సై రవికుమార్ అవినీతి ఆరోపణలతో అధికార పార్టీ నాయకులకు కోమ్ముకాస్తూ ప్రతిపక్ష పార్టీల నాయకుల వద్ద నుండి భూమి తగాదాలను, చిన్న చిన్న పంచాయతీలలో కూడా చేతివాటం ప్రదర్శించేస్తూ వేలాది రూపాయలు తీసుకుంటున్నారని ఆరోపణలు అనేకంగా ఉన్నాయి. ఈ దశలో ఎస్సై సస్పెండ్ కావడం పోలీస్ స్టేషన్ చరిత్రలో మొదటిది పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
