TRS | కవిత అరెస్ట్

TRS | కవిత అరెస్ట్
TRS | ఆంధ్రప్రభ, వెబ్‌డెస్క్ : ధాన్యం కొనుగోలులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సచివాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. వరి ధాన్యాన్ని రోడ్డుపై పోసి నిరసన వ్యక్తం చేసిన ఆమె.. రైతుల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
రాష్ట్ర ప్రభుత్వం రైతులను చిన్నచూపు చూస్తోందని, అన్నదాతలను అరిగోసలు పెడుతోందని కవిత మండిపడ్డారు. తెలంగాణ రైతుల గోస ముఖ్యమంత్రి, ప్రభుత్వానికి తెలియాలనే ఉద్దేశంతో సచివాలయం ఎదుట ధర్నా చేపట్టినట్లు తెలిపారు. రెండున్నరేళ్లలో వ్యవసాయ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా సమీక్ష నిర్వహించలేదని విమర్శించారు.
రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కల్లాల్లో ఉన్న వరి ధాన్యంతో పాటు జొన్నలను కూడా ప్రభుత్వం వెంటనే కొనుగోలు చేయాలని కవిత డిమాండ్ చేశారు. ఆందోళన కొనసాగుతుండగా పోలీసులు కవితతో పాటు పార్టీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని ఫలక్‌నుమా పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
