AP | ఒకే కుటుంబంలో ముగ్గురు మహిళల బలవన్మరణం…
AP | గూడూరు, ఆంధ్రప్రభ : గూడూరు మండలం పోసినవారి పాలెం పంచాయతీ పొట్టేలగుంట పేటలో ఘటన జరిగింది. మృతులు అనుముకొండ రజని (60) కుమార్తె తోట గౌరి (40), కోడలు మధుబాల (35) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సమస్యలే ఆత్మహత్యలకు కారణమని స్థానికులు భావిస్తున్నారు. తల్లి కుమార్తె ఒక గదిలో చనిపోగా, మరో గదిలో కోడలు ఉరివేసుకొని చనిపోయింది. ఆత్మహత్యకు గల కారణం పై లెటర్ రాసినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు.

స్థానికులు హుటాహుటిన పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి పోలీసులు వచ్చారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మహిళలు ఉరివేసుకుని చనిపోవడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. ఏ కారణంతో చనిపోయారో తెలియక చాలామంది భయంతో చెందుతున్నారు. కుటుంబ కలహాల కారణంగానే మృతి చెందారని పలువురు అంటుండగా దానికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియవలసి ఉంది. ఈ వార్త తెలియడంతో సమీప గ్రామాలకు చెందిన ప్రజలు సైతం ఘటన ప్రాంతానికి వస్తున్నారు. ఘటనా స్థలికి పోలీసులు చేరుకున్నారు. మృతికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

