TG | కాంగ్రెస్ మ‌ళ్లీ అధికారంలోకి రాక‌పోతే రాజ‌కీయాల‌కు స్వ‌స్తి – మంత్రి కోమ‌టిరెడ్డి

హైద‌రాబాద్‌, ఆంధ్ర‌ప్ర‌భ : తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకి రావ‌డం క‌లే అని రోడ్లు, భ‌వ‌నాల శాఖ మంత్రి కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి అన్నారు. సోమవారం మీడియాతో కోమ‌టిరెడ్డి మాట్లాడుతూ వంద‌కు వంద శాతం మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఒక వేళ అలా జరుగకపోతే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటా అని అన్నారు. త‌న‌ సవాల్‌కు కేటీఆర్‌ సిద్ధమేనా? అని ప్రశ్నించారు. ప్రభాకర్ రావు విదేశాల నుంచి వస్తే.. కేసీఆర్ కుటుంబం తప్పకుండా జైలుకు వెళ్తుందని అన్నారు. తాము ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో ఇప్పటికే ఐదు అమలు చేశామని, మిగిలినవి కూడా అతి త్వరలో అమలు చేస్తామని తెలిపారు.

Leave a Reply